Thursday, 3 December 2015

మహాలక్ష్మి దేవి నివసించే స్థానాలు ఏవి? (Which Places Does Goddess Maha Lakshmi live?)

యత్యత్ మంగళం ఆయత్తం శుచి స్వచ్చం హితం శుభం
తత్తత్ సర్వం మహాలక్ష్మియాన్ స్థానం ఇతి పరికీర్తితం

మహాలక్ష్మి అమ్మవారు నివసించే స్థానాలు మొత్తం 96 గా శాస్త్రం చెప్పబడింది. కాని అందులో ముఖ్యంగా

  1. పసుపు
  2. కుంకుమ
  3. బంగారం
  4. రత్నాలు
  5. ఆభరణాలు
  6. ముత్యాలు
  7. శుభ్రమైన తెల్లని వస్త్రాల యందు (నల్లని మరియు ఎర్రని వస్త్రాల యందు లక్ష్మి దేవి ఉండదు)
  8. వెండి, రాగి, ఇత్తడి కళశాల యందు
  9. ఆవు పేడ
  10. ఆవు పృష్ట స్థానం
  11. ఆవు కొమ్ముల మధ్యన
  12. పూజా మందిరం
  13. పవిత్రమైన మనస్సు
  14. దర్బలు
  15. మహానుభావులు
  16. యోగులు
  17. మునులు
  18. ఋషులు
  19. ఉత్తమమైన రాజు
  20. సదాచార బ్రాహ్మణుడుఇలా మొత్తం 96 చోట్లు లక్ష్మి నివాస స్థలాలుగా చెప్పబడ్డాయి. అలాగే లక్ష్మి నివసించని స్థానాలు కూడా చెప్పబడ్డవి.

  1. తల దువ్వుకోకుండా వెంట్రుకలు విరబోసుకుని ఉన్న స్త్రీల యందు
  2. ఏ ఇంటి యందు స్త్రీలు దుఃఖిస్తారో
  3. సగం వస్త్రాలు ధరించిన వారిలో
  4. ఏ ఇంటి యందు పరిశుభ్రత ఉండదో
  5. అనాచారం ఉన్నచోట
  6. నఖములు ఉన్నచోట
  7. కేశములు ఉన్నచోట
  8. చూపులో, పలుకులో కఠినత్వం ఉన్నచోట
  9. హింసలో
  10. హింసించే ఆయుదంలో
ఇలా మహాలక్ష్మి లేని చోట్లు 46 చెప్పబడ్డాయి. ఎక్కడైతే మహాలక్ష్మి నివశించదో అక్కడ లక్ష్మి దేవి అక్కగారైన జేష్టాదేవి (దరిద్రదేవత) ఉంటుంది.

Wednesday, 2 December 2015

గుడి వెనుక ఇల్లు కట్టుకోవచ్చునా?

గుళ్ళు మూడు రకాలుగా చెప్పవచ్చును. మొదటిది విష్ణువు ఆలయాలు, రెండవది శివుని ఆలయాలు ఇక మూడవది మహాలక్ష్మి ఆలయాలు అంటే అమ్మవారు ఆలయాలు. ఇక గుడి వెనుక ఇల్లు కట్టుకోవచ్చునా అనే ప్రశ్నకు సమాధానం విష్ణువు ఆలయానికి వెనుక ఇల్లు కట్టుకోకూడదు. శివుని ఆలయానికి ముందు వైపు ఇల్లు కట్టుకోకూడదు. అమ్మవారి ఆలయానికి రెండు వైపులా ఇల్లు కట్టుకోకూడదు అని శాస్త్రం చెబుతుంది. ఎంత దూరం వరకు కట్టుకోకూడదు అంటే విష్ణువు ఆలయం యొక్క నీడ పడనంత దూరంలో ఇల్లు కట్టుకోవాలి. అలాగే శివుని ఆలయానికి గుడిలోని దీపం కనిపించనంత దూరంలో ఇల్లు కట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది.

Saturday, 13 June 2015

ఇంట్లో దేవుని దగ్గర ఏ నూనెతో దీపం వెలిగిస్తే శ్రేష్టం?

ఇంట్లో దేవుని దగ్గర దీపానికి ఈ క్రింది నూనెలు వాడవచ్చు. అయితే అన్నింటికంటే ఆవు నెయ్యి  శ్రేష్టం తరువాత  ఈ క్రిందివి వరుసగా వస్తాయి.
1. ఆవు నెయ్యి
2. మరి ఏ ఇతర నెయ్యి అయినా
3. నువ్వుల నూనె
4. వేరుశనగ నూనె
5. కుసుమ నూనె
6. ఆముదం

Wednesday, 21 January 2015

మాఘ మాసం

మాఘ మాసం 
మాఘ మాసం నదీ స్నానం చేసేటపుడు ఈ క్రింది శ్లోకాన్ని చదవితే మంచి ఫలితాలు పొందవచ్చు. 
దు:ఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణో స్తోషనాయ  చ  
ప్రాత: స్నానం కరోమ్యధ్య మాఘే పాప వినాశనం  
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేనేమే దేవ యధోక్త ఫలదోభవ.