యత్యత్ మంగళం ఆయత్తం శుచి స్వచ్చం హితం శుభం
తత్తత్ సర్వం మహాలక్ష్మియాన్ స్థానం ఇతి పరికీర్తితం
మహాలక్ష్మి అమ్మవారు నివసించే స్థానాలు మొత్తం 96 గా శాస్త్రం చెప్పబడింది. కాని అందులో ముఖ్యంగా
తత్తత్ సర్వం మహాలక్ష్మియాన్ స్థానం ఇతి పరికీర్తితం
మహాలక్ష్మి అమ్మవారు నివసించే స్థానాలు మొత్తం 96 గా శాస్త్రం చెప్పబడింది. కాని అందులో ముఖ్యంగా
- పసుపు
- కుంకుమ
- బంగారం
- రత్నాలు
- ఆభరణాలు
- ముత్యాలు
- శుభ్రమైన తెల్లని వస్త్రాల యందు (నల్లని మరియు ఎర్రని వస్త్రాల యందు లక్ష్మి దేవి ఉండదు)
- వెండి, రాగి, ఇత్తడి కళశాల యందు
- ఆవు పేడ
- ఆవు పృష్ట స్థానం
- ఆవు కొమ్ముల మధ్యన
- పూజా మందిరం
- పవిత్రమైన మనస్సు
- దర్బలు
- మహానుభావులు
- యోగులు
- మునులు
- ఋషులు
- ఉత్తమమైన రాజు
- సదాచార బ్రాహ్మణుడుఇలా మొత్తం 96 చోట్లు లక్ష్మి నివాస స్థలాలుగా చెప్పబడ్డాయి. అలాగే లక్ష్మి నివసించని స్థానాలు కూడా చెప్పబడ్డవి.
- తల దువ్వుకోకుండా వెంట్రుకలు విరబోసుకుని ఉన్న స్త్రీల యందు
- ఏ ఇంటి యందు స్త్రీలు దుఃఖిస్తారో
- సగం వస్త్రాలు ధరించిన వారిలో
- ఏ ఇంటి యందు పరిశుభ్రత ఉండదో
- అనాచారం ఉన్నచోట
- నఖములు ఉన్నచోట
- కేశములు ఉన్నచోట
- చూపులో, పలుకులో కఠినత్వం ఉన్నచోట
- హింసలో
- హింసించే ఆయుదంలో
ఇలా మహాలక్ష్మి లేని చోట్లు 46 చెప్పబడ్డాయి. ఎక్కడైతే మహాలక్ష్మి నివశించదో అక్కడ లక్ష్మి దేవి అక్కగారైన జేష్టాదేవి (దరిద్రదేవత) ఉంటుంది.
No comments:
Post a Comment