![]() |
అరటి పండు |
అభుక్తామలకం శ్రేష్టం
భుక్తాకు బదరీ ఫలం
కదళీ నకలాచన
"అభుక్తామలకం శ్రేష్టం" అంటే ఆమ్లం (ఉసిరి) , అభుక్తా అంటే అన్నం తినకముందు అంటే భోజనానికి ముందు ఉసిరి తినడం చాలా మంచిది. ఇందులో ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయి. భోజనానికి ముందు ఉసిరి తినడం వలన మనం తిన్న ఆహారం అరగడానికి కావలసిన ఆమ్లాలు స్రవించడానికి ఉసిరి దోహదపడుతుంది. అలాగే ఉసిరి తినడం వలన మనం ఆయుర్వేదంలో చెప్పుకునే త్రిదోషాలు (వాతము, పిత్తము మరియు కఫము) రాకుండా ఉసిరి కాపాడుతుంది. అందుకే మనం రోజూ భోజనానికి ముందు ఉసిరి తినాలి. ఒకవేళ మనకు ఉసిరి అందుబాటులో లేకుంటే ఉసిరి ఊరగాయ నిల్వచేసుకుని రోజూ భోజనంలో తీసుకుంటే చాలా మంచిది.
" భుక్తాకు బదరీ ఫలం" అంటే భుక్తాకు అంటే భోజనం తరువాత బదరీ ఫలం (రేగి పండు) తినడం వలన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
"అలాగే కదళీ నకలాచన" కదళీ అంటే అరటి పండు. అరటి పండు భోజనం ముందు గానీ, భోజనం మధ్యలో గానీ మరియు భోజనం తరువాత గానీ స్వీకరించడం మంచిది కాదు. అదేంటండి అలా అంటారు అందరూ భోజనం తరువాత అరటి పండు తింటే అరుగుదలకు మంచిది అంటారు మరి మీరు ఇలా చెబుతున్నారు అనొచ్చు. అరటిపండు అరుగుదలకు మంచిదే కానీ భోజనం సమయంలో స్వీకరించడం వలన కఫమును కలిగిస్తుంది. కాబట్టి అరటిపండు భోజనం సమయంలో తప్ప మిగతా సమయంలో సేవించడం మంచిది.