Tuesday, 1 March 2016

భోజనం తరువాత అరటిపండు తింటే మంచిదా?

అరటి పండు

అభుక్తామలకం శ్రేష్టం
భుక్తాకు బదరీ ఫలం
కదళీ నకలాచన

"అభుక్తామలకం శ్రేష్టం" అంటే ఆమ్లం (ఉసిరి) , అభుక్తా అంటే అన్నం తినకముందు అంటే భోజనానికి ముందు ఉసిరి తినడం చాలా మంచిది.  ఇందులో ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయి. భోజనానికి ముందు ఉసిరి తినడం వలన మనం తిన్న ఆహారం అరగడానికి కావలసిన ఆమ్లాలు స్రవించడానికి ఉసిరి దోహదపడుతుంది. అలాగే ఉసిరి తినడం వలన మనం ఆయుర్వేదంలో చెప్పుకునే త్రిదోషాలు (వాతము, పిత్తము మరియు కఫము) రాకుండా ఉసిరి కాపాడుతుంది. అందుకే మనం రోజూ భోజనానికి ముందు ఉసిరి తినాలి. ఒకవేళ మనకు ఉసిరి అందుబాటులో లేకుంటే ఉసిరి ఊరగాయ నిల్వచేసుకుని రోజూ భోజనంలో తీసుకుంటే చాలా మంచిది. 
" భుక్తాకు బదరీ ఫలం" అంటే భుక్తాకు అంటే భోజనం తరువాత బదరీ ఫలం (రేగి పండు) తినడం వలన కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. 
"అలాగే కదళీ నకలాచన" కదళీ అంటే అరటి పండు. అరటి పండు భోజనం ముందు గానీ, భోజనం మధ్యలో గానీ మరియు భోజనం తరువాత గానీ స్వీకరించడం మంచిది కాదు. అదేంటండి అలా అంటారు అందరూ భోజనం తరువాత అరటి పండు తింటే అరుగుదలకు మంచిది అంటారు మరి మీరు ఇలా చెబుతున్నారు అనొచ్చు. అరటిపండు అరుగుదలకు మంచిదే కానీ భోజనం సమయంలో స్వీకరించడం వలన కఫమును కలిగిస్తుంది. కాబట్టి అరటిపండు భోజనం సమయంలో తప్ప మిగతా సమయంలో సేవించడం మంచిది.

Monday, 15 February 2016

అన్నప్రాసన ఎప్పుడు, ఎలా చేయాలి?


5 నెలల 5 రోజులకు అన్నప్రాసన చేయాలి. ఈ అన్నప్రాసన అమ్మాయి వారి పుట్టింట్లో సహకుటుంబ సమేతంగా దేవునికి నైవేద్యంగా అర్పించిన దానిని తినిపించాలి. ఈ నైవేద్యం ఘ్రుత (నెయ్యి), దధి (పెరుగు), మధు (తేనె), ఓదనం (అన్నం) కలిపి తయారు చేయాలి. ఈ నైవేద్యాన్ని వెండి పళ్ళెంలో ఉంచి బంగారు చెంచాతో గాని లేదా బంగారు ఉంగరంతో గాని తినిపించాలి. మళ్ళీ ఇక్కడ ఎవరు తినిపించాలి అంటే తండ్రి కాని, తల్లి కాని, తాతయ్య కాని, అమ్మమ్మ కాని లేదా మేనమామ కాని తినిపించాలి.

Friday, 12 February 2016

తలస్నానం ఏయే రోజుల్లో చేయకూడదు?


స్త్రీలు:   స్త్రీలు సోమవారం, మంగళ వారం, గురువారాలు తలస్నానం చేయకూడదు.
సోమవారం స్నానం చేయడం వలన తాపం కలుగుతుంది. గురువారం తలస్నానం చేయడం వలన దరిద్రం కలుగుతుంది. శుక్ర వారం (తప్పని సరిగా చేయాలి), శని వారం, ఆదివారం తలస్నానం చేయవచ్చు.
పురుషులు:  పురుషులు శుక్రవారం నాడు తలస్నానం చేయకూడదు. శని వారం, ఆదివారం తలస్నానం చేయడం ఉత్తమం.

గమనిక: పండుగలు, పర్వ దినాలు, విశేషమైన రోజుల్లో పై నియమాలు పాటించనవసరం లేదు.